మంచినీటి సమస్య ఉందా ? ఈ నెంబర్ కు ఫోన్ చేయండి.. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

.ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
త్రాగునీరు రాకపోయినా, పైప్ లీకేజీ ఉన్న ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అయినా మంచినీటి సమస్య తలెత్తి అధికారులు నిర్లక్ష్యం వహించినా , అధికారులకు తెలియక నీళ్లు రాకపోయినా ప్రజలు ఇబ్బంది పడవద్దని ఐ డి ఓ సి కార్యాలయంలో ప్రత్యేకంగా 08744241950 ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ ను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ 18005994007 నెంబర్ కు కూడా ఫిర్యాదు చేయొచ్చని ఆయన తెలిపారు. ఏదైనా గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడితే
స్థానిక అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చు అని అన్నారు. మీ ఫిర్యాదు రాష్ట్ర కార్యాలయంలో రికార్డ్ అవుతుందని తర్వాత అక్కడి అధికారులు ఆ సమస్యను సంబంధిత జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారికి తెలుపుతారు. ఆ అధికారి సంబంధిత అధికారిని క్షేత్రస్థాయికి పంపి సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు అని అన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఆ విషయాన్ని జిల్లా అధికారి తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తెలుపుతారు.టోల్ ఫ్రీ నంబర్ కార్యాలయం అధికారులు ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా లేదా? అని ధ్రువీకరించుకుంటారు అని కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now