*ఏ నోటు తయారీకి ఎంత ఖర్చో తెలుసా?*
కరెన్సీ అనేది రాక ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేదనే సంగతి తెలిసిందే. అంటే… ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతి అన్నమాట.
దీన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటారు. అనంతరం కాలంలో ద్రవ్య వినిమయం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో క్రీ.శ. 9వ శతాబ్దంలో తొలిసారిగా ద్రవ్య వినియోగం అమల్లోకి వచ్చిందని చెబుతారు.
ఈ క్రమంలో భారత్ లో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది. ఇందులో భాగంగా.. 1935 ఏప్రిల్ 1న ఏర్పడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 1938 నుంచి కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. నాడు ఒక రూపాయి నోటు నుంచి రూ.2000 (ఇప్పుడు రద్దయ్యింది) నోటును భారత్ తయారు చేసింది. ఈ నేపథ్యంలో ఏ నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో చూద్దామ్….
రూ.500 నోటు ముద్రణ ఖర్చు రూ.2.94
రూ.200 నోటు ముద్రణ ఖర్చు రూ.2.93
రూ.100 నోటు ముద్రణ ఖర్చు రూ.1.77
రూ.50 నోటు ముద్రణ ఖర్చు రూ.1.13
రూ.20 నోటు ముద్రణ ఖర్చు రూ.0.95
రూ.10 నోటు ముద్రణ ఖర్చు రూ.0.96
రూ.2000 నోటు ముద్రణ ఖర్చు రూ.3.54 (రద్దు చేయబడింది)
ఈ క్రమంలో… రూ.500 నోటుపై ఢిల్లీలో 17వ శతాబ్దంలో నిర్మించిన ‘ఎర్రకోట’ చిత్రాన్ని ముద్రించగా.. రూ.200 నోటుపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 2వ శతాబ్దపు నిర్మాణం సాంచి ‘బౌద్ధ స్థూపం’ చిత్రాన్ని ముద్రించారు. ఇదే క్రమంలో… రూ.100 నోటుపై గుజరాత్ లోని పఠాన్ లో ఉన్న ‘రాణీకి వావ్’ చిత్రం ఉంటుంది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
రూ.50 నోటుపై కర్ణాటక రాష్ట్రం హంపిలో 15వ శతాబ్దంలో నిర్మించిన ‘రథం’ చిత్రాన్ని ముద్రించారు. రూ.20 నోటుపై ఔరంగాబాద్ లోని ఎల్లోరా గుహల చిత్రాన్ని ముద్రించారు. ఇక రూ.10 నోటుపై ఒడిశా రాష్ట్రంలోని 13వ శతాబ్దంలో నిర్మించిన ‘కోణార్క్ సూర్య దేవాలయ రథ చక్రం’ చిత్రాన్ని ముద్రించారు….