హిందూ దేవాదాయ చట్టంలో ఈ విషయాలు మీకు తెలుసా?
హిందూదేవాలయ చట్టం 30/1987..
ఈ చట్టం ప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాస గృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టర్లు, బ్యానర్లు,మైక్ సెట్ ద్వారా ప్రార్ధనల వంటి అన్యమత ప్రచారం నిషేదించబడింది. ఇలా అతిక్రమిస్తే వారు జి.ఓ. నెం. 746,747 ప్రకారం అరెస్టు అయితే బెయిల్ కూడా రాని శిక్షకు అర్హులవుతారు.ఇదే చట్టం ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్ ,సిగరెట్, ఉమ్మివేయడం వంటి అకృత్యాలకు పాల్పడితే (హిందువైనా) శిక్షకు అర్హులవుతారు. మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్ధన మందిరాలు నిర్మించ తలపెట్టిన జిల్లా కలెక్టరు అనుమతి తప్పని సరి.హిందూమతాన్ని దూషించడం, అసభ్యంగా మాట్లాడ టం చేసిన యెడల ఐ.పి.సి 2959(1),ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి మాట్లాడుతూ ఆ సంస్కృతి పరువు తీసినా, అలా ప్రచురించినా.. ఐ.పి.సి503 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కోరవచ్చు.అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు లిఖితపూర్వకంగా యస్.ఐ.కి ఇవ్వవచ్చు. 219 సెక్షన్ ప్రకారం రిజిస్టర్ చేయాలి. అలా ఫిర్యాదు రిజిస్టర్ చేయకపోతే సెక్షన్ 217 ద్వారా ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేయవచ్చు..