Site icon PRASHNA AYUDHAM

ఈ ఫొటోలో కనిపిస్తున్న వారెవరో తెలుసా..?

IMG 20251013 WA0006

ఈ ఫొటోలో కనిపిస్తున్న వారెవరో తెలుసా? చాలా మందికి తెలియదు. వీరు ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 .

వీరిలో మధ్యలో ఉన్న ఆవిడే అరుణారాయ్ IAS. తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పేదల తరుపున తన గొంతు వినిపించడంలో ముందున్నారు. ఎడమవైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి శంకర్ సింగ్. వీరు సామాజిక కార్యకర్త.

కుడివైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి నిఖిల్ డే. వీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నినంధించాలని తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి వచ్చిన వ్యక్తి. పై ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే నాడు మజ్దాూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే సంస్థ ప్రారంభించి సాగించిన ఉధ్యమ పలితమే సమాచార హక్కు చట్టం. అందుకే వారిని మనం ఎప్పుడూ అభినందించాల్సిందే.

ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, శ్రామికులకు RTI సామాజిక కార్యకర్తలకు అందరికీ సమాచార హక్కు చట్టం-2005

20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

Exit mobile version