*గేమ్స్ ఎవరితో నైనా పెట్టుకో…కోర్టు తో కాదు….ఎందుకో తెలుసా….అయితే ఈ వార్త చదవాల్సిందే*
*కోర్టు ధిక్కారానికి పాల్పడిన నిందితులు.. వినూత్న శిక్ష విధించిన ఢిల్లీ న్యాయస్థానం…చేతులు పైకి ఎత్తి రోజు మొత్తం నిల్చోవడం…*
కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు నిందితులకు ఢిల్లీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. చేతులు పైకెత్తి కోర్టు హాలులో రోజంతా నిలబడాలని ఆదేశించింది. 2018కి సంబంధించిన ఓ కేసు తుది విచారణలో జ్యుడీషియల్ మేజిస్ట్రేటు సౌరభ్ గోయల్ ఈ శిక్ష విధించారు.
ఉదయం 10 నుంచి 11.40 గంటల మధ్య వేచి ఉండి, రెండుసార్లు పిలిచినా నిందితులు బెయిల్ బాండ్లు సమర్పించలేదు. కోర్టు సమయం వృధా చేయడమంటే మా ఉత్తర్వులను ధిక్కరించడమే. ఐపీసీలోని 228వ సెక్షను కింద నిందితులు కోర్టు సమయం ముగిసేదాక చేతులను నిటారుగా పైకెత్తి నిలబడాలి అని జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
కాగా, ఈ కేసు నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే చనిపోగా.. ఆనంద్, కుల్దీప్, రాకేశ్, ఉపాసన మిగిలారు. మధ్యాహ్నం 12.48 గంటల ప్రాంతంలో కుల్దీప్ బెయిల్ బాండ్లతో పాటు దరఖాస్తును సమర్పించాడు.