కంప్యూటర్ సైన్సులో బాన్సువాడ వాసి సౌమ్యకు డాక్టరేట్

కంప్యూటర్ సైన్సులో బాన్సువాడ వాసి సౌమ్యకు డాక్టరేట్

ప్రశ్న ఆయుధం 05 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి )

కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో బాన్సువాడ వాసి సౌమ్య డాక్టరేట్ సాధించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని బొమ్మన్ దేవుపల్లి గ్రామానికి చెందిన అధ్యాపకులు జంబిగ శంకర్ సతీమణి సౌమ్య అన్నామలై యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు.బిహేవియర్ అనాలసిస్ ఆఫ్ హ్యూమన్ అండ్ అనిమల్స్ యూజింగ్ డీప్ లర్నిండ్” పై పరిశోధన గ్రంథం అందించగా, ఈమేరకు యూనివర్సిటీ డైరెక్టరెట్ ఆఫ్ అకడమిక్ నుండి అవార్డు మెమో జరీ చేశారు. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. బాలసుబ్రమన్యన్, డాక్టర్ వైదేహి పర్యవేక్షణలో గ్రంథం సమర్పించారు. డాక్టరేట్ గ్రహీత సౌమ్య ప్రస్తుతం స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.ఈ మేరకు కళాశాల యాజమాన్యం, సహచర సిబ్బంది, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ ప్రాంత మహిళకు డాక్టరేట్ రావడం పట్ల బొమ్మందేవ్ పల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment