సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన జీవశాస్త్ర విభాగ అధిపతి రమేష్ కు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తారా ప్రభుత్వ కళాశాలలో కళాశాల ఎగ్జామినేషన్ బ్రాంచ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా పని చేస్తున్న జీవశాస్త్ర విభాగ అధిపతి అయిన రమేష్ కు మద్రాస్ లోని ప్రెసిడెంట్ కళాశాల, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా లభించడం చాలా సంతోషకరమని అన్నారు. అదే విధంగా డాక్టర్ రమేష్ కళాశాల ప్రిన్సిపాల్ గా త్వరలో ప్రమోషన్ పొందాలని అధ్యాపకులు పేర్కొంటూ డాక్టర్ రమేష్ ను కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్, ఐ.క్యూ.ఏ.సీ కో ఆర్డినేటర్ డాక్టర్ మల్లిక, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, ఇతర అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
తారా కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్
Oplus_0