రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 2

 

స్థానిక స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా డాక్టర్స్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డాక్టర్ రమణ, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎం జైపాల్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రపంచంలో గౌరవనీయమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది డాక్టర్ అని ప్రతి డాక్టర్ దైవంతో సమానమని ఇలాంటి డాక్టర్స్ డే రోజు డాక్టర్ని సన్మానించుకోవడం మన అందరి బాధ్యత తెలిపారు.

భూమి మీద కనిపించే దైవం డాక్టర్ అని, ఈ డాక్టర్స్ డే రోజు 25 మంది డాక్టర్లని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శంకర్, సెక్రెటరీ సబ్బాని కృష్ణ హరి, ట్రెజరర్ పి వెంకటరమణ, ప్రోగ్రాం చైర్మన్ వెంకట్రాజం, శ్రీశైలం ,డాక్టర్ బాలరాజు, డాక్టర్ రవీందర్ రెడ్డి, పున్న రాజేష్, రాజనర్సింహారెడ్డి, అయిత బాలకిషన్, ఇతర రొటేరియన్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now