*హుజురాబాద్ నియోజకవర్గంలోనీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలి*.
*రోగులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆన్ని చర్యలు తీసుకోవాలి.*
*జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కోరిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్*
*జమ్మికుంట/హుజురాబాద్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 6*
హుజురాబాద్ నియోజకవర్గంలోనీ ఆన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని హాస్పటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యంతోపాటు ఔషధ మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కోరినట్లు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.రాబోయే రోజుల్లో దవాఖానాలకు అవసరమయ్యే నిధులను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తీసుకొచ్చేల కృషి చేస్తానని తెలిపారు