స్లాట్ బుకింగ్‌కు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన: కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన

*స్లాట్ బుకింగ్‌కు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన: కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 16

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఈరోజు నిరసన దీక్షకు దిగారు. “పాత పద్ధతి ముద్దు – కొత్త పద్ధతి వద్దు” అంటూ వారు నినాదాలు చేయడంతో కార్యాలయ పరిసరాలు మార్మోగాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 30,000 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కొత్త విధానానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కీసర డాక్యుమెంట్ రైటర్లు ప్లకార్డులు పట్టుకొని కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ, “మేము గత 30 సంవత్సరాలుగా డాక్యుమెంట్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం తీసుకువస్తున్న స్లాట్ బుకింగ్ విధానం వల్ల మా జీవనోపాధి కోల్పోతుంది. మాకు లైసెన్సులు జారీ చేసి, పాత విధానాన్నే కొనసాగించాలని” ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

“ప్రభుత్వం లైసెన్స్ సిస్టంను ఏర్పాటు చేసి న్యాయసమ్మతమైన మార్గాన్ని ఎంచుకోవాలి” అని వారు స్పష్టం చేశారు. అలా చేయని పక్షంలో గత ప్రభుత్వంలో జరిగినట్లుగానే మహా ధర్నాకు దిగేందుకు కూడా వెనుకాడబోమని వారు హెచ్చరించారు. అనంతరం వారు తమ వినతులను సబ్ రిజిస్ట్రార్‌కు పత్రరూపంలో అందజేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు తమ ఐక్యతను చాటుతూ నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment