బండ్ల అంగడిలో వాహనాల పత్రాల పరిశీలన

బండ్ల అంగడిలో వాహనాల పత్రాల పరిశీలన

కొనుగోలు ముందు RC, ఓనర్‌ షిప్ పత్రాలు తప్పనిసరిగా చూడాలని సూచన

— ట్రాఫిక్ ఎస్ఐ మహేష్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 10

 గురువారం ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బండ్ల అంగడిని సందర్శించి ప్రతి వాహనానికి సంబంధించిన RC మరియు ఓనర్‌షిప్ పత్రాలను సవివరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, వాహనం కొనుగోలు చేసే ముందు సంబంధిత RC, ఇన్సూరెన్స్, మరియు వాహన పత్రాలను పూర్తిగా పరిశీలించి తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు. అనధికార వాహన లావాదేవీలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ ఐ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment