కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 4
దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ వారు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య ఆనాడు సామాజిక స్పృహతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని, విసునూర్ దేశముఖ్ ల అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడై తరువాత తెలంగాణాలో జరిగిన ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలన్నిటికి ఆదర్శనంగా నిలిచారాని అని పేర్కొన్నారు.
కురుమ సంఘ నాయకులు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో తొలి అమరుడు అని తెలియ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషించదగినది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుర్మా సంగం జిల్లా అధ్యక్షులు మర్కంటి భూమయ్య,విద్యార్థి సంగం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, KYCS ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ , వర్కింగ్ ప్రెసిడెంట్ నిఖిల్,ప్రచార కార్యదర్శి రవి, స్వామి, గంగాధర్ ,రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య,సాప శివరములు, Dist. బిసి, డెవలప్మెంట్ ఆఫీసర్, చక్రధర్ , వసతి గృహ సంక్షేమ అధికారులు నరేష్, పవన్, రాజేశ్వర్, స్వప్న, సునీత, తదితరులు పాల్గొన్నారు.