దొడ్డు, సన్నం వడ్లకు బోనస్ వెంటనే అందించాలి
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో నీ తాళ్ల రాంపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలోఏర్పాటు చేయడం జరిగింది.ఈ వరి కొనుగోలు కేంద్రాలపై బి.ఆర్.ఎస్. పార్టీ పై, ప్రజా ప్రతినిధులపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అనాలోచితంగా, అవివేకంగా టిఆర్ఎస్ పార్టీ పై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గురువారంరోజున విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గతంలో ఐదు నుంచి 6, కిలోలు కడతా తీసుకునేవారని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనంఅన్నారు.బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నా వాళ్ళ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంఅని వారు పేర్కొన్నారు. ఒకపక్క రైతులు పండించిన వరి పంటను, రోడ్ల పైన ఆరబెట్టి అమ్ముడుపోక, పడికాపులు కాస్తున్న, ఇసుక రవాణాపై తప్ప,రైతులు పండించిన వరి ధాన్యంపై పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కడ్త విషయంపై, గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదు,ఇప్పటికీ పంటకు ప్రభుత్వం ఇస్తామన్నా 500 రూపాయల బోనస్ ఇవ్వకపోగా, పైగా విమర్శలు చేయడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని విమర్శించారు.సన్నం వడ్లతో పాటు, దొడ్డు వడ్లను కూడా కొని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయల బోనస్ను వెంటనే రైతులకు చెల్లించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరఫునప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను నిలువెత్తిన ముంచిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే, అది కాంగ్రెస్ పార్టీ అని రైతులకు ఇప్పటికే అర్థమయిపోయింది అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అన్వేష్ రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి, ప్రస్తుతం రైతులు అనుభవిస్తున్న కష్టాలకు పూర్తి బాధ్యతలు తీసుకోని, పండిన దొడ్డు, సన్నా వడ్లను రైతు పండించిన ప్రతి గింజను కొనాలి,అంతేకాకుండా వారికి మద్దతు ధర తో పాటుగా 500 రూపాయలు బోనస్ ఇప్పించాలి, లేదంటే రైతులు తగిన గుణపాఠం చెబుతారుఅని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అసత్య మాటలు మానుకొని, క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకోవాలని, బిఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండుప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్.ఎస్.పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షులురాజా పూర్ణ నందం, గ్రామ శాఖ అద్యక్షులు బొనగిరి రమేష్, బి.యర్. ఎస్ నాయకులూ అశోక్ యాదవ్, నేరెళ్ళ దేవన్న, గంగాధర్, అడెల్లి, తదితరులు పాల్గొన్నారు.