*ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? భర్తకు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా?*
సాధారణంగా భార్యలు తమ భర్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అతడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడకూడదని కోరుకుంటారు. అతడి పాత ప్రేమకథలు తెలుసుకుని ఈర్ష్య పడుతుంటారు. భర్త పక్కన వేరే అమ్మాయిని ఊహించుకోలేరు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిస్తే షాక్‌తో నివ్వెరపోతారు. ఓ అమ్మాయి తన భర్తకు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ గురించి తెలుసుకుని షాక్ అవుతారు. ఎందుకంటే ఆ మహిళ తన భర్తకు ఎవరూ ఊహించుకోలేని యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @kapil_parod అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన భర్తతో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. తన భర్తను సర్‌ప్రైజ్ చేసేందుకు ఆమె మంచి ప్లాన్ వేసింది. తన భర్త మాజీ ప్రియురాలిని తన వివాహ వార్షికోత్సవానికి ఆహ్వానించింది. తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌ను చూసి ఆ వ్యక్తి షాకయ్యాడు. ఆ మాజీ గర్ల్‌ఫ్రెండ్ కూడా విచారంగా ఉంది. ఆ సమయంలో వారిద్దరూ ఆమెను ఓదార్చారు. ఆ తర్వాత తమ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను భార్య ఎదుటే అతడు కౌగిలించుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.5 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. “అలాంటి భార్య అందరికీ ఉండాలి“, “అతడు నిజంగా చాలా అదృష్టవంతుడు“, “ఇది నిజమేనా? స్క్రిప్టెడ్ అయి ఉండవచ్చు“, “ఇది ఫేక్“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు..