పాకిస్తాన్‌ మళ్లీ ఆ పీడకలను కోరుకుంటుందా ?

పాకిస్తాన్‌ మళ్లీ ఆ పీడకలను కోరుకుంటుందా ?

కాల్పుల విరమణ ఒప్పందం నిన్నటితో ముగిసిపోయిందని సోమవారం నుంచి మళ్లీ యుద్ధం అంటూ సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేసేస్తున్నారు. కానీ ఓ వైపు పాకిస్తాన్ అప్పుల కోసం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కార్యాలయం ముందు పడిగాపులు పడుతోంది. ఓ ఎనిమిది వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది. అయితే బోలెడన్ని షరతులు పెట్టింది. అందులో ఒకటి భారత్ తో ఉద్రిక్తతలు పెంచుకోకపోవడం.

ఆ లోన్ ఇంకా శాంక్షన్ కాలేదు. పాక్ అకౌంట్లో పడలేదు. ఆ లోన్ ఏదో వస్తే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారేమో కానీ.. అదిఇంకా రాలేదు. పాకిస్తాన్ కు ఇప్పుడు భారత్ తో యుద్ధం కన్నా.. తమ ఆర్థిక సమస్యలు, రోజు గడవడం చాలా ముఖ్యంగా మారింది. యుద్ధం వల్ల ఎయిర్ బేస్‌లు దెబ్బతిన్నాయి. వాటిని రిపేర్ చేయించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మళ్లీ భారత్ తో ఉద్రిక్తతలు అంటే .. ఏదో సినిమాల్లో బ్రహ్మానందం డైలాగ్ .. “ ఇక చాల్లేరా” అని ఆర్మీ చీఫ్‌గా షాబాజ్ షరీఫ్ చెబుతాడు.

కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి భారత్ – పాక్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ అది ఉగ్రవాదంపై మాత్రమే. కాల్పుల విరమణపై మాత్రమే. అంతకు మించి చర్చలు జరగాలంటే.. రెండే రెండు అజెండాలు ఉండాలని భారత్ చెబుతోంది. ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం.. రెండోది ఉగ్రవాదుల అప్పగింత. ఈ రెండింటిపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్దపడదు. భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తీవ్రంగా విరుచుకుపడుతోంది. తమ డిమాండ్లు అవేనని చెబుతోంది. ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ అంతు చూస్తామని బహిరంగంగానే హెచ్చరికలు పంపుతోంది. కానీ పాక్ మాత్రం కుక్కిన పేనులా పడి ఉంది. ఇక్కడే అసలేం జరుగుతోందో అర్థమైపోతుందిగా ?. మళ్లీ యుద్ధమంటే ఎవరు నమ్ముతారు?

Join WhatsApp

Join Now