ముగ్గురు ఉపాధ్యయుల పై ఫోక్సో కేసు నమోదు..?

కీచక ఉపాధ్యాయుల పై వేటు పడేనా..?

— ఒకరి పై కేసు నమోదు..?

— గత నెల 27 తారీకు ఒకరి పై కేసు నమోదు..?

— ఎస్సై ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయలేరు?

— ఇంత జరుగుతున్న విద్యాశాఖ ఏం చేస్తున్నట్టు..?

— మండలంలో ఎంఈఓ ఉన్నట్లా లేనట్టా..?

— జిల్లా ఉన్నతాధికారి చర్యలు తీసుకునేనా..?

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

గురువు లేనిదే గుడ్డి విద్య అనే నానుడి ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు ప్రతినోటిలో ఊత పదంల చెప్పుకుంటున్న మనం. ఈ రోజుల్లో గురువులే గుడ్డి విద్యలు నేర్పుతున్నట్లు దారితప్పి తప్పిదాగిన సందర్భాలుగా మీనవేషాలు వేస్తున్న కొందరు కీచక ఉపాధ్యాయులు వాస్తవంగా తల్లి తర్వాత గురువే దైవం అని భావించే మన సాంప్రదాయంలో అలాంటి విలువకు మచ్చ తెస్తున్న వైనం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఆ మండల కేంద్రంలో ఉన్న ఎంఈఓ ఏం చేస్తున్నట్లు,వారు ఎలాంటి సమాచారాన్ని స్వీకరించారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఎన్ని గంటలు జరిగిన ఎంఈఓ స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయని అంటున్నారు? వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లాలోని ఓ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న మూడు గ్రామాల లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పీఈటీలు, ఒక ఉపాధ్యాయుడి ఫోక్సోకేసు నమోదు అయినట్లు సమాచారం.? పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ పై నిర్భయ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో ఫిజికల్ డైరెక్టర్ పై అభియోగం ఉన్నట్లు విచారణ చేస్తున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. అయితే ఏకంగా ఓ గ్రామానికి చెందిన విద్యార్థి పై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి విషయంపై స్పందించిన షీ టీం స్పందించడం ద్వారా

ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేసినట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు.అదేవిధంగా ఆ పాఠశాలలో మరో ఇద్దరు ఇద్దరు ఉపాధ్యాయులపై అభియోగం రాగా ఒకరిపై కేసు నమోదు చేసి మరొకరి ప్రమేయంపై ఆధారాలు స్వీకరిస్తున్నట్లు సమాచారం. అందులో ఓ ఉపాధ్యాయుని పై చట్టరీత్యా చర్యలు తీసుకొని రిమాండ్ కు పంపించారని ప్రజలు గుస గుసలు ఆడుతున్నారు.ఈ యొక్క విషయంపై ఆ యొక్క ఉపాధ్యాయ సంఘాలు, అధికార ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సమాచారాన్ని రహస్యంగ కప్పిపుచ్చుడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుగుతుందా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ విషయాన్ని ఇంత గోప్యంగా కప్పిపుచ్చడంలో గోప్యం ఏంటి జిల్లా డీఈవో స్పందిస్తారా లేక విచారణ అనంతరం వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నారా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే? ఏది ఏమైనా తల్లి తండ్రి తర్వాత హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం గురువు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చే స్థానాన్ని సైతం దుర్వినియోగం చేయడంపై మేధావి వర్గం మండిపడుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment