Site icon PRASHNA AYUDHAM

రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండి

IMG 20240928 WA0568

రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 28, కామారెడ్డి :

రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దాన శిభిరంను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న వారు రక్తాన్ని దానం చేయవచ్చని, రక్తం దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడగలిగిన వారమవుతామనీ తెలిపారు. డి.ఆర్. డి. ఎ. ఆధ్వర్యంలో 35 మంది నుండి రక్తాన్ని సేకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సి. పి. ఒ. రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Exit mobile version