కామారెడ్డిలో అన్నప్రసాదానికి ₹1,01,118 విరాళం
— టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా
ప్రశ్న ఆయుధం నవంబర్ 27
కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 36వ మండల పూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప ఆలయంలో నిర్వహిస్తున్న మహా కుంభాభిషేక విశేష అన్నప్రసాదానికి ధాతగా ₹1,01,118 విరాళం అందజేశారు.
అయ్యప్ప స్వాములు బిక్ష కార్యక్రమం జరుగుతున్న వేళ, అన్నప్రసాదం కోసం ఈ విరాళాన్ని సమర్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప కమిటీ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, పేపర్ శ్రీనివాస్, మానస రాజేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల అంజయ్య, నిమ్మ విజయ్ రెడ్డి, పంపరి శ్రీనివాస్, జూలూరు సుధాకర్, సాయిబాబా, సలీం, గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.