సీఎంఆర్ఎఫ్ కు కొరమండల్ వారి భారి సహాయం
వరద బాధితు
ల సహాయార్థం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శంకర సుబ్రమణియన్ , సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.