సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్యకు రిటైర్డ్ ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్ పలు రకాల పుస్తకాలను అందజేశారు. విద్యా సేవలో అనేక దశాబ్దాలు గడిపిన షరీఫ్, తనకు ఉన్న పుస్తక ప్రేమను సమాజానికి పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జి.అంజయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండల గ్రంథాలయాలకు ఈ పుస్తకాలను పంపిణీ చేసి, పాఠకులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుస్తకాలు విద్యార్థులు, పుస్తకాభిమానులు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి అంజయ్య, భారతీయ విద్యా మందిర్ ప్రిన్సిపాల్ లింగాగౌడ్, గ్రంధాలయ సెక్రటరీ వసుంధర, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.