వీధివాసుల నీటి కష్టాలు తొలగించేందుకు మోటర్ దానం
జూలూరుపాడు మండలం మాల కాలనీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎస్సీ మాల కాలనీలో గత కొంతకాలం నుండి నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు గతంలో అధికారులకు విన్నవించిన కొంత సమస్య పరిష్కారం అయింది మళ్లీ అదే కష్టాలను ఎదుర్కొంటున్న ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియపరచగా ఎస్సీ మాల కాలనీకి చెందిన ఎస్సీ మాల కాలనీ గ్రామ పెద్దలు మందా పుల్లయ్య తండ్రి నరసయ్య మీ నీటి కష్టాలను తొలగించుతానని స్వచ్ఛందంగా తమ వంతు సహాయ సహకారాలు మా కుటుంబ సభ్యులు తరఫున బోరు మోటర్ ను మానవత్వం దృక్పథంతో అవసరమైన పరికరాలను సమకూర్చుతానని ఇట్టి బోరును ఎస్సీ మాల కాలనీలో ఉన్నటువంటి ప్రజలు తమ అవసరాలను తీర్చుటకు మా వంతు కాలనీవాసులందరకు ఉపయోగించుకోవచ్చు* గ్రామపంచాయతీ గ్రామ సెక్రెటరీ వారికి స్వాధీన పరుస్తున్నామని తెలియజేసినారు భవిష్యత్తులో మండలంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేసినారు అంతేకాకుండా కాలనీ వాసులో సమస్యలను ఎల్లప్పుడూ కష్టసుఖాలు పాలుపంచుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మాల మహానాడు మండల కమిటీ సభ్యులు బడుగు వీరస్వామి, కల్లోజి వెంకట్ , కల్లోజి దినేష్ , గాథమ్ బన్ను, బడుగు మౌళి, కల్లోజి మనోజ్ , పసుపులేటి పవన్ , బర్ల వంశీ, వేమూరి అఖిల్ , మహిళలు కల్లోజి కనకమ్మ, కల్లోజి అనిత , కల్లోజి జ్యోతి, లక్ష్మీకాంత, కల్లోజి కుమారి, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు