భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమానికి విజయవాడ వాస్తవ్యులు నరసింహమూర్తి లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఆలయ అధికారులకు లక్ష విలువగల చెక్కును అందజేశారు. అనంతరం దాత నరసింహమూర్తిని ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.