Site icon PRASHNA AYUDHAM

కళ్యాణ మండప నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

IMG 20251229 200145

కళ్యాణ మండప నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

దేవునిపల్లి పద్మశాలి సంఘం సేవాభావం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 29 

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి కొత్త దేవునిపల్లి పద్మశాలి సంఘం ప్రతినిధులు లక్ష రూపాయల విరాళం అందజేశారు. సోమవారం ఈ విరాళాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) సభ్యులకు అందించారు. పేద, బడుగు, బలహీన వర్గాల శుభకార్యాల నిమిత్తం VDC ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపానికి దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని VDC ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాతం రామ్ చందర్, ఉపాధ్యక్షులు ధాస కిషన్, తిప్పని గణశ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీగాధ అశోక్, కోశాధికారి జొర్రీగల నరసయ్య, ఆడిటర్ బిట్ల మురళి, సహాయ కార్యదర్శులు కుసుమ రమేష్, వైట్ల కృష్ణ, అలాగే పాముల సంతోష్ కుమార్ తదితర సంఘ సభ్యులు మాట్లాడుతూ, కళ్యాణ మండప నిర్మాణంలో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.        ఈ కార్యక్రమంలో VDC అధ్యక్షుడు గూడెల్లి గంగారాం, ప్రధాన కార్యదర్శి ద్యావరి నవీన్, ఉపాధ్యక్షులు డా. వంగ రాహుల్, నిట్టు లింగారావ్, నీలం రాజలింగం, మోత్కూరి నరేష్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావ్, మాజీ కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజిరావు, గ్రామ పెద్దలు మరియు VDC సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version