సంగారెడ్డి/సదాశివపేట, మే 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలంలోని నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల పని తీరు మరియు వినూత్న కార్యక్రమాల నిర్వహణ తీరును మెచ్చుకొని హైదరాబాదు ప్రగతి ప్రింటర్స్ యజమాని రావి.రాంబాబు పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలతో ముద్రించి ఆ కర పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు.రామకృష్ణకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ప్రగతి ప్రింటర్స్ యజమాని రాంబాబును అభినందించారు.