దేవాలయ నిర్మాణానికి పదివేల రూపాయలు విరాళం

 

 

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

 

జిల్లాలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతున్న మండలంలోని గూడూరు గ్రామంలో గుంటూరు శ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ ఆశీస్సులతో

శ్రీ గురుపీఠం ఫౌండర్ అండ్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతుల ఆధ్వ ర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీగురుపీఠం నిర్మాణం లో భాగంగా తనవంతు సహకారంగా గూడూరు గ్రామానికి చెందిన అరగొండ నారాయణ, కిష్టమ్మ దంపతుల కుమారుడు అభిలాష్, స్వంతంగా 10 వేల రూపాయల విరాళాన్ని శ్రీగురు పీఠం ట్రస్ట్ కు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడ

ఆధ్యాత్మికతను కలిగి ఉండాలని, దైవచింతన కలిగిన ప్రవళిక సోదరుడు అభిలాష్ శ్రీగురుపీఠం నిర్మాణానికి సహకారం అందించినందుకు భగవంతుడు అరగొండ అభిలాష్ కుటుంబానికి ప్రతి నిత్యం ప్రశాంతమయ జీవితం అందించాలని, భవిష్యత్లో మరిన్ని సేవాకార్యక్ర మాలను చేపట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now