*దేవాలయాల అభివృద్ధికి విరాళం*
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

జిల్లా జిన్నారం మండలంలో దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి విరాళం అందజేశారు. కాజిపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ కాశీ విశాలాక్షి విశ్వనాథ గణపతి నూతన దేవాలయానికి ₹1,01,116, అలాగే సోలక్‌పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ₹40,000 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మికతను ప్రోత్సహించేందుకు, దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు భగవంతుడి కృపతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా దేవాలయాల నిర్వాహకులు గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాజిపల్లి, సోలక్ పల్లి, గ్రామస్థులు నాయకులు హాజరైనారు
Post Views: 24