రేవంత్ సాబ్ ఎవరికి భయపడొద్దు..!
ప్రజలందరూ మీ వెంటే ఉంటారు..
షాద్ నగర్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అలీ
రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ధైర్యసహసాలతో చేపట్టిన హైడ్రా కార్యక్రమం మంచిదేనని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రైతు కాలనీకి చెందిన ఖిలా మస్జిద్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అలీ తెలిపారు. హైడ్రాను పేద ప్రజల అభివృద్ధిగా ఆయన అభివర్ణించారు. పేదల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన వారిని ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టకూడదని పేర్కొన్నారు. సర్కార్ ఆస్తి రాబోయే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేయడం ఎంత గొప్ప విషయమని ఆయన కితాబునిచ్చారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని న్యాయం చేయడం ప్రభుత్వ ధర్మమని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఒక భగవంతుడికి మాత్రమే భయపడాలని, ఇంకెవరికీ భయపడాల్సిన అవసరం లేదని భగవంతుడే ఆయన వెంట ఉంటాడని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వెనుక తమలాంటి సామాన్య ప్రజలు కూడా ఉంటారని.. భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయాలని ఆయన ఆకాంక్షించారు.