*అసత్య ప్రచారాలను నమ్మవద్దు-జిల్లా ఎస్పీ జానకి షర్మిల*
*నిర్మల్ -డిసెంబర్ 31:-* ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు జిల్లా ప్రజలను అసత్య ప్రచారాల ద్వారా సోషల్ మీడియాలో కొంతమంది కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా ఎస్పీ డా.కి.జానకి షర్మిల ఐపిఎస్ పత్రిక ప్రకటనలో ఈ విధంగా తెలియజేసారు. మంగళవారం తెల్లవారుజామున భైంసా నాగదేవత గుడిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గల హుండిని పెకిలించే క్రమంలో హుండి సమీపంలోని టైల్స్ పగిలిపోయాయి. ఇంతకుమించి దేవాలయంలో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ప్రచారం అవుతున్నాయి కాబట్టి ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఎస్పి విజ్ఞప్తి చేశారు. ఇట్టి అసత్య ప్రచారాలు చెసే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడుతాయని తెలియజేసారు.