విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా

విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా

– గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

– సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం

– కరీంనగర్ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్. 

ఏబీవీపీ పెద్దపల్లి శాఖ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రాసూరి ప్రవీణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని,కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని,మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఎంతోమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని అన్నారు.ఒకే సంవత్సరంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారని, అది మరవకముందే ఇంకో సంఘటన జరుగుతుందని,మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేడని,ఈ ప్రభుత్వం విద్యార్థుల గురించి పట్టించుకోవడం లేదని,మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారని,ఎక్కడ ఏ సంఘటన జరిగినా అధికారులు అస్సలు స్పందించడం లేదంటే ప్రాణాలు కోల్పోతేనే వీరు స్పందిస్తారా అని,ఇప్పటికే 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీస సోయి లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, జోనల్ ఇంచార్జ్ దినేష్, నాయకులు ముమ్మడి అరవింద్, శివకుమార్, మణికంఠ, ఉదయ్ కిరణ్, శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment