Site icon PRASHNA AYUDHAM

కాలయాపన వద్దు వర్గీకరణ ముద్దు

WhatsApp Image 2025 01 11 at 8.51.48 PM

సిద్దిపేట,11 జనవరి 2025 : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చలో హైదరాబాద్ మాదిగల మహాగర్జన సభను విజయవంతం చేయాలని శనివారం ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మాదిగల మహాగర్జన కరపత్రాలు ఆవిష్కరించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 12 లక్షల రూపాయల అభయ హస్తం పథకం వెంటనే అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పేరున ఇస్తున్న ఇళ్లను ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని డప్పు, చెప్పు వృత్తిదారులకు 4000 రూపాయలు పెన్షన్ ప్రకటించాలి.అసైన్డ్ భూముల ను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలన్నారు.మాదిగ చర్మకారుల లీడ్ క్యాప్ భూములను పరిరక్షించి నిధులు మంజూరు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిద్ధిని రాజమల్లయ్య మాదిగ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, బొంబాయి వెంకన్న మాదిగ, జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ మాదిగ, జిల్లాష ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడా ప్రశాంత్ మాదిగ, జిల్లా కమిటీ సభ్యులు దండు రాజు, ముత్యాల దానియేలు, గజపాక ఎల్లన్న, రమేష్ , అశోక్ మాదిగ, సుక్క మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version