ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చెయ్యను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..

ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చెయ్యను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..

-ఓ రైతు ఆవేదన

కామారెడ్డి జిల్లా రామారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 11:

రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మంత్రి భగవాన్ అతని తండ్రి మంత్రి మొగులయ్య చెందిన సర్వే నెంబర్ 856/B/1లో 17 గుంటల భూమి ఉందని, అట్టి భూమిని నా పేరుపైన చేయగలరని రామారెడ్డి ఎమ్మార్వో ను అడిగినందున, 17 గుంటల భూమికి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పారని చేయించుకోమంటే రుచి మీసేవ సెంటర్లో 16 వందల రూపాయల కట్టి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగిందని, స్లాట్ బుక్ చేసుకొని నెలరోజులవుతుందని , నా పేరు పైన చేయడం లేదని ఇట్టి విషయం పైన పలుసార్లు ఎమ్మార్వో కార్యాలయమునకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఎమ్మార్వో కార్యాలయంలోనికి రానివ్వడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుక్ చేసిన తర్వాత రెండు రోజులలోనే రిజిస్ట్రేషన్ అవుతుందని కానీ నన్ను కావాలని ఆర్.డీ.ఓ.కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని చెప్తున్నారని అన్నారు. మీసేవ సెంటర్లో కూడా స్లాట్ బుక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు.కానీ నా దగ్గర మీసేవ సెంటర్ యజమాని నా దగ్గర 1600 రూపాయలు తీసుకొని స్లాట్ బుక్ చేసి నెలరోజులు అవుతుందని అతనిని అడుగుతే ఎమ్మార్వో ఆపమన్నారని అందుకే ఆపడం జరిగిందని నీవు ఇక్కడ ఏం మాట్లాడవద్దు ఏదైనా మాట్లాడాలంటే ఎమ్మార్వో తోటి మాట్లాడాలని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటున్నాడని అందుకే జిల్లా ప్రజావాణికి రావడం జరిగిందని , సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారని త్వరలోనే నీకు న్యాయం చేస్తామని చెప్పారని తెలిపారు.

Join WhatsApp

Join Now