మద్యం సేవించి స్కూల్ వాహనాలు నడపొద్దు – ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
ట్రాఫిక్ ఎస్ఐ మహేష్
డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన అధికారులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 17
జిల్లా కేంద్రంలో స్కూల్ వాహనాలు నడిపే డ్రైవర్లపై ఈరోజు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. విద్యార్థుల ప్రాణ భద్రత దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని డ్రైవర్లకు పోలీసులు స్పష్టం చేశారు.ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, వేగం మించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలు జరగకూడదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు తేలితే సంబంధితులపై చట్టబద్ధ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ. మహేష్ మరియు సిబ్బంది పాల్గొని డ్రైవర్లకు భద్రతా సూచనలు అందజేశారు.