యువత చెడు వ్యసనాల బారిన పడవద్దు :
ఎస్సై పి బాబు
రెసిడెన్షియల్ పాఠశాలలో డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన
ప్రశ్న ఆయుధం,హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డిసెంబర్ 21
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు మఠంపల్లి ఎస్సై పి బాబు మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీ లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్ నరసింహారావు, మహమ్మద్ కళాబృందం సిబ్బంది గోపయ్య, గురులింగం,చారి, నాగార్జున పాల్గొన్నారు.