Site icon PRASHNA AYUDHAM

ఓవైసీ బ్రదర్స్‌కు భయపడొద్దు.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ మద్దతు..

ఓవైసీ బ్రదర్స్‌కు భయపడొద్దు.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ మద్దతు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని ఎమ్మెల్యే తెలిపారు. వేల మంది యువత మద్దతు ఉందని అక్బరుద్దీన్ బెదిరిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరి భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళాలని సూచించారు.ఓవైసీ బ్రదర్స్‌ను బొక్కలో వేసిన సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుందని గుర్తుచేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. చెరువులో 12ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజ్‌ను నిర్మించారన్నారు. అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు గులాంగిరి చేసిందని విమర్శించారు. కలెక్టర్ సాయంతో గోషామహాల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.

Exit mobile version