నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు పెట్టవద్దు సీఐ రవి

*గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి*

*గణపతి మండపాల వద్ద డిజేలు పెట్టవద్దు*

*జమ్మికుంట సీఐ వరగంటి రవి*

జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జమ్మికుంట మున్సిపాలిటీ తోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో గణపతి మండప నిర్వాహకులు భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని జమ్మికుంట సీఐ వరగంటి రవి అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం జమ్మికుంట మున్సిపాలిటీ తోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో గణపతి విగ్రహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు శనివారం ప్రతిష్టించారని వినాయక విగ్రహాలు ప్రతిష్టించిన మండపాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో డీజే లు పెట్టవద్దని సీఐ రవి తెలిపారు. విగ్రహాలను ప్రతిష్టించిన దగ్గర రాత్రిపూట తప్పనిసరిగా ఉత్సవ కమిటీలో ఉన్న ఒక వ్యక్తి ఉండాలన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నుండి విద్యుత్ కొరకు పర్మిషన్ తీసుకొని విద్యుత్తును వాడాలన్నారు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినట్లయితే నివారించడం కొరకు అందుబాటులో నీటిని ఉంచుకోవాలని వినాయక విగ్రహం ప్రతిష్టించిన వద్ద మద్యం సేవించరాదని దేవుని విగ్రహం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పూజలు నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు వాట్సాప్ గ్రూప్ గా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఆ గ్రూపులో తెలపాలని పేర్కొన్నారు పోలీస్ శాఖ ఇచ్చిన నియమ నిబంధనలు ఉత్సవ కమిటీ పాటించాలని తెలిపారు.

Join WhatsApp

Join Now