“డీజే లు వద్దు – డప్పులే ముద్దు”

“డీజే లు వద్దు – డప్పులే ముద్దు”

పిట్లం పోలీసుల కఠిన హెచ్చరిక – గణేష్ మండపాల వద్ద డీజేలకు నో

18 మంది డీజే యజమానులను బైండోవర్ చేసిన పోలీసులు

“డీజే లు వద్దు – డప్పులే ముద్దు” అంటూ మండప నిర్వాహకులకు కౌన్సెలింగ్

మండల వ్యాప్తంగా గణేష్ మండపాల తనిఖీలు

ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ టీ. వెంకట్రావు పర్యవేక్షణ

ప్రశ్న ఆయుధం ఆగష్టు 23 పిట్లం,

రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో కఠిన చర్యలు చేపట్టారు. మండలంలోని డీజే యజమానులను పిలిపించిన పోలీసులు, ఎక్కడా గణేష్ మండపాల వద్ద డీజేలు వాడకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలో 18 మంది డీజే యజమానులను బైండోవర్ చేశారు.మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ మండపాలను పోలీసులు స్వయంగా తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు.జిల్లా ఎస్పీ సూచనల మేరకు “డీజే వద్దు – డప్పులే ముద్దు” అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి, మండప సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ టి. వెంకట్రావు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment