*ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంత రమేష్..*
* ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..
హుజురాబాద్ డిసెంబర్ 26
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుఢు వేం నరేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి స్వగృహంలో టిపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దొంత రమేష్ మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక లోటు లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్దలు వేం నరేందర్ రెడ్డి సలహాలు సూచనలతో ప్రగతి పథంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అని వారు చేపట్టిన ఈ పదవికి తగిన న్యాయం చేస్తున్నారని చేపట్టిన ఈ పదవికి వన్నె తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోమ్మటి వెంకటేశ్వర్లు ఉన్నారు.