సిపిఆర్ పై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి  డాక్టర్ బి నాగేందర్

సిపిఆర్ పై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి

డాక్టర్ బి నాగేందర్

వనస్థలిపురం, అక్టోబర్ 15: ( ప్రశ్న ఆయుధం) అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను రక్షించుకునేందుకు ఉపయోగపడే సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మహేశ్వరం మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో అనస్తిషియ విభాగం ఆధ్వర్యంలో బుధవారము ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మహేశ్వరం మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ బి నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైనా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి స్పృహ కోల్పోయిన, పడిపోయిన, హార్ట్ ఎటాక్ సమయంలో సిపిఆర్ తో బాధితుల ప్రాణాలు కాపాడవచ్చునని మహేశ్వరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రాక్టీకల్ తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ రాజకుమార్, డాక్టర్ సాధన, డాక్టర్ అనిల్, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment