డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

ప్రశ్న ఆయుధం, 15 నవంబర్, బాన్సువాడ

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనీలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,ప్రజల సమక్షంలో పోచారం భాస్కర్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మాజీ డిసిసిబి చైర్మన పోచారం భాస్కర్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు
కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు, బుడగ జంగాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ…
ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దిక్సూచిగా నిలుస్తోందని తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గం లోని ఎక్కువ గ్రామాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పోచారం కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి ఆశయ సాధనకు సంపూర్ణంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణ కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క బుడగ జంగాల కులస్తులకు 40 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి అర్హులకు అందించిన ఘనత పోచారందే అని తెలిపారు
ఇంకా ఎవరైనా ఇల్లు లేని నిరుపేదలు మిగిలి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వములో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామని తెలిపారు
ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ దాత పోచారం భాస్కర్ రెడ్డికి బుడగ జంగం ఆడపడుచులు మంగళ హారతులతో స్వాగతం పలికి శాలువా, దండలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now