జిల్లా ఉత్తమ రక్తదాత పురస్కారానికి ఎంపికైన డాక్టర్ బాలు…
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 30, కామారెడ్డి :
జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్తమ రక్తదాతల పురస్కారాల కార్యక్రమానికి ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను ఎంపిక చేశారు.
వ్యక్తిగతంగా 74 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, ప్రభుత్వ వైద్యశాలలో వివిధ చికిత్సల నిమిత్తమై కావలసిన రక్తాన్ని అందించడం కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నందుకు ఈ పురస్కారాన్ని మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలో అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ… 2008 నుండి రక్తదాన కార్యక్రమాల నిర్వహించడం జరుగుతుందని, వేలాదిమందికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ రక్తదానం పైన అవగాహన కార్యక్రమాల నిర్వహించడం జరుగుతుందని, తలసేమియా చిన్నారుల కోసం సంవత్సర కాలంలోని అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ ఐవిఎఫ్ లు గుర్తింపు పొందడం జరిగిందని, కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు.