ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశాల మేరకు పట్టణంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు

*ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశాల మేరకు పట్టణంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

* బాబు సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాల మేరకు తెదేపా నాయకులు సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా కాలనీ ప్రధాన రోడ్ లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు కేకు కట్ చేసి అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమన్నారు. ఆయన దళిత, బలహీన, బడుగు, అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగంలోని పలు ప్రధాన కీలక అంశాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అంబేడ్కర్ ఎంతో మేలు చేశారన్నారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు గురించి పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి,జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment