” అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం తపించిన మహానేత.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – సత్యం శ్రీరంగం.”
” భారత దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – సత్యం శ్రీరంగం ”
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ డా. బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో పలు అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ అంబేద్కర్ భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు దళిత హక్కుల పోరాట యోధుడు నేటి స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన చేసిన లెక్కలేనన్నిసేవలను గౌరవించటానికి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటామని అన్నారు. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని అణగారిన వర్గాల కోసం సాధికారత మరియు ఆందోళనలకు అంకితం చేశారని, దేశంలోని ప్రతీ పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, మానవతా విలువలు నేర్పిన మహనీయుడని, స్వాతంత్య్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డా. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడని అన్నారు. దేశం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు పేదల దరిచేరుతున్నాయంటే దానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగమే ముఖ్య కారణామన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందని, మత రాజకీయాలను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని, దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీదే కీలక పాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు అదిముల్ల రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీడిమెట్ల రమేష్, డివిజన్ ల అధ్యక్షులు కృష్ణ రాజపుత్, మేకల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూము వినయ్, ఎల్లేష్ యాదవ్, రఘు నాధ్, నరసింహ యాదవ్, హేమంత్, శేఖర్ గజానంద్, మేకల నర్సింగ్ రావు, కృష్ణ వేణి, అనిల్, కట్టా నర్సింగ్ రావు, కలికోట శంకర్, రవి స్టీవెన్సన్, కర్కే నిఖిల్, టింకు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.