సాంస్కృతిక సారధి చైర్పర్సన్ డా. వెన్నెలకు అభినందనలు

చైర్పర్సన్
Headlines
  1. తెలంగాణ సాంస్కృతిక చైర్పర్సన్‌గా గద్దర్ కూతురు వెన్నెల
  2. కళాకారుల సంక్షేమం కోసం వెన్నెల పట్టుదల
  3. గద్దర్ వారసురాలిగా తెలంగాణ సాంస్కృతిక శాఖకు వెన్నెల
  4. ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున వెన్నెలకు ఘన సన్మానం
  5. వెన్నెల నేతృత్వంలో కళాకారుల భవిష్యత్‌కు నూతన దిశ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ గా ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు డాక్టర్ జి. వి వెన్నెల నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ డాక్టర్ వెన్నెల నివాసంలో కలిసి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి శుభ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుడిగా జీవితాంతం ప్రజల కోసమే పాటలు పాడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జనం కోసమే జీవించిన ప్రజా యుద్ధనౌక గద్దరన్న కూతురు డాక్టర్ జి. వి వెన్నెల కు సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ పదవి ఇవ్వడం ద్వారా యావత్ తెలంగాణ కళాకారులందకి దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప కళాకారుడు గద్దర్. ఆయన కూతురుకి ఈ పదవి దక్కడం గర్వకారణం అన్నారు. కలలకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి తెలియజేసేదే కళాకారులు. అలాంటి కళాకారుల శాఖ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ గా డాక్టర్ జి.వి వెన్నెలక్క నియమితులు కావడం మహిళా లోకానికి గర్వకరణం అన్నారు. కళాకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ కళాకారుల చేత తెలంగాణ చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వెన్నెలక్క కృషి చేయాలని ఆశిస్తూ ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, ఇంతియాజ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment