డి.ఎం. న్యూరాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ కందికొండ రాజేందర్
అభినందనలు తెలిపిన అమృత న్యూరో హాస్పిటల్ సిబ్బంది
జమ్మికుంట సెప్టెంబర్ 11 ప్రశ్న ఆయుధం
గురువారం రోజున అమృత విశ్వ విద్యాపీఠం (కోయంబత్తూర్) నుండి డీ.ఎం. న్యూరాలజీ లో గోల్డ్ మెడల్ ను డాక్టర్ కందికొండ రాజేందర్ అందుకున్నారు న్యూరో ఫిజీషియన్ కి జమ్మికుంట ప్రజలతో పాటు అమృత న్యూరో హాస్పిటల్ సిబ్బంది ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అమృత న్యూరో హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ“డాక్టర్ రాజేందర్ అందించిన వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అమూల్యమైనవని ఇలాంటి ప్రతిభావంతులైన వైద్యులను జమ్మికుంటలో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం” అని డాక్టర్ రాజేందర్ గోల్డ్ మెడల్ సాధనపై వైద్యులు, మిత్రులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు