రెండవ సారి డాక్టరెట్ అందుకున్న డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్
హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ చేతుల మీదుగా
హైదరాబాద్ ఫిబ్రవరి 4
హైదరాబాద్ రాంనగర్ లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సలహాదారు ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ చేతుల మీదుగా గ్లోబల్ అసోసియేషన్ జర్మనీ పీష్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ రెండవసారి డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కు మెడల్స్ వేస్తూ సర్టిఫికెట్ అందింఛి గవర్నర్ దత్తాత్రేయ. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సామాజిక సేవలో సౌత్ ఇండియా పాండిచ్చేరి పట్టణం షాన్బాగ్ హోటల్లో ఆగస్టు 24 న అందుకోవడం జరిగింది .అని గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలో నిరుపేదలకు వృద్ధులకు అనాధలకు సేవలు చేస్తున్నటువంటి డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కరోనా విపత్కర పరిస్థితిల్లో ఆదుకొని రెక్కాడితే డొక్కాడని నిరుపేదలకు దాదాపు 10 వేల మందికి పైగా నిత్యవసర సరుకులు మాస్టర్స్ హోమియో సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ ద్వారా ఉచిత 15వేల మందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు .మరియు దాతల సహాయంతో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ హై క్యాంపులు మెడికల్ క్యాంపులు అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు లాంటి ఎన్నో సేవలు చేసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ గొప్ప వ్యక్తి అని అన్నారు. ఇంకా మరెన్నో సేవలు చేసి సామాజిక సేవలో ముందుకు పోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ బిసి కౌన్సిల్ నెంబర్ సంజన వేణి మహేంద్ర ,ఫోరం సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమాన్న యాదవ్, బిసి సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షులు అందేలా కుమార్ యాదవ్ ,బెల్లంపల్లి నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షులు బోయిన తిరుపతి యాదవ్ ,మంచిర్యాల జిల్లా నాయకులు పాయవేణి మల్లేష్ యాదవ్ , మరియు యాదవసంఘం నాయకులు పాల్గొన్నారు.