ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 30 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
బహుముఖ ప్రజ్ఞాశాలిగా అన్ని రంగాలలో ఆల్ రౌండ్ ప్రతిభను కనపరిచే ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉపాధ్యాయ లోకాని కే గర్వకారణం అన్నారు.
సుజాతనగర్ మండల విద్యాధికారిణి లీల
విద్యా రంగంలోనూ సామాజిక సేవా రంగంలోనూ కళా రంగంలోనూ ఆల్ రౌండ్ ప్రతిభను కనబరుస్తూ,సామాజిక చైతన్యం కోసం పాటుపడుతూ,అవసరత ఉన్నవారికి అన్నివేళలా చేయూతనిస్తూ,గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తో పాటు ఇంకా ఎన్నో జాతీయ రాష్ట్ర అవార్డులు పొంది,ఇటీవలనే అత్యంత ప్రతిష్టాత్మకరమైన తెలుగు భాషకు పట్టము కట్టి ప్రాణ ప్రతిష్ట చేసిన,కవి రచయిత సాహితీ వేత్త,సినీ గీత రచయిత,గజల్స్ పండితుడు,తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్,పద్మశ్రీ పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరున ప్రతిష్టాత్మక ర
డాక్టర్ సినారె సాహిత్య సేవా పురస్కారాన్ని
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఇటీవల హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అతిరథ మహారధుల చేతుల మీదుగా తీసుకోవడం మన జిల్లాకే కాకుండా,విద్య రంగానికి కూడా గర్వకారణమని
సుజాతనగర్ మండల విద్యాధికారిణి లీల ఉద్ఘటించారు.
ఈ సందర్భంగా సింగభూపాలం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాధవరావు,సుజాతనగర్ కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ
రామ్ దాస్,రిసోర్స్ పర్సన్స్ బిక్కులాల్ శ్రీనివాస్, కుమారస్వామి,
ఉపాధ్యాయ నాయకులు మంగీలాల్,నరసింహ,భీముడు, నాగమణి తేజవత్ కమల, కృష్ణవేణితదితరులు పాల్గొన్నారు.