ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 7
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ రగడ సంతాపం వ్యక్తం చేశారు.సిపిఐ పార్టీలో అంచెలంచలుగా ఎదిగి,ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నతమైన స్థాయిలో సేవలందిస్తూ,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గా కూడా కార్మిక కర్షక పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కూలీల కోసం ప్రజల కొరకు ప్రశ్నించే గొంతుకగా నేనున్నానంటూ అండగా నిలిచిన పోరాట యోధుడిగా,సుదీర్ఘకాలంగా కమ్యూనిస్టు పార్టీలో సేవలందిస్తూ నిబద్ధత నిజాయితీ నికార్శైన నాయకుడిగా అందరి హృదయాలలో స్థానం సంపాదించిన స్వర్గీయ అయోధ్య మరణం ప్రజా ఉద్యమాలకు వామ పక్ష ఉద్యమాలకు తీరని లోటనిఅనుచర డాక్టర్ మద్దెల అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పని నుండి అయోధ్య గారు బాగా పరిచయమనివారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి సభ్యులు గిడ్ల పరంజ్యోతి రావు, ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసం రామకృష్ణ, అపరబాలు అల్లిశంకర్, సినీ నటులు తాండూర్ ధనరాజ్, చిరంజీవి సేవా సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి విల్సన్ బాబు,గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకులు లావుడియా సత్యనారాయణ గుగులోత్ కృష్ణ బోడ గణేష్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జోసఫ్, ముస్లిం మైనారిటీ నాయకులు తోత పాషా తదితరులుఉన్నారు.
బొల్లోజు అయోధ్యకు ప్రగాఢ సంతాపం డాక్టర్ మద్దెల శివకుమార్ ప్రగాఢమైన సంతాపం
by Naddi Sai
Published On: August 7, 2025 6:53 pm