Site icon PRASHNA AYUDHAM

సింగరేణి ఉద్యోగ విరమణ ఘనంగా సత్కరించి డాక్టర్ మద్దెల శివకుమార్!

IMG 20250601 WA0364

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 1 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి ఉద్యోగ విరమణ పొందిన సూర్యనారాయణ అంకితభావం,దీక్ష దక్షతలు,సేవా తత్పరత కలిగిన సమర్థుడైన అధికారి అన్నారు.
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించి, కఠోర పరిశ్రమతో ఉన్నత విద్యలను అభ్యసించి, సింగరేణి కాలరీస్ సంస్థలో, చిరు ఉద్యోగిగా తన ప్రస్థానం ప్రారంభించి, అంకితభావం, దీక్ష దక్షతలు, వృత్తి పట్ల సమర్ధత, అటు అధికారులతోనూ ఇటు కార్మికులతోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ,అంచలంచలుగా ఎదిగి అత్యున్నత స్థానమైన
జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేయడం
ఎంతో గర్వకారణమని, అంబేద్కర్ భావజాలాన్ని కలిగి, మృదుస్వభావిగా, సామాజిక సేవా దృక్పథం కలిగి అందరి మన్ననలు పొందిన
శ్రీ సూర్యనారాయణ గారి సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, భారతరత్నం అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.శనివారం రాత్రి సింగరేణి జిఎం సివిల్ శ్రీ టి సూర్యనారాయణ ఉద్యోగ విరమణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో,
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ గౌరవ అతిథిగా పాల్గొని సూర్యనారాయణ దంపతులను శాలువాలతో గజమాలతో ఘనంగా సత్కరించి అభినందించి , ప్రసంగిస్తూ ఉత్తమమైన మానవ జన్మకు సార్ధకతగా ప్రతి ఒక్కరూ సామాజిక హితానికి పాటుపడాలని పేద వర్గాలను, అవసరత ఉన్న వాళ్లను ఆదుకోవాలని, నేను సైతం అంటూ అన్ని రంగాలలో ముందుండి భాగస్వామ్యాన్ని వహించాలని , అదే దేవుడు మెచ్చిన ఉత్తమమైన జీవితమని పిలుపునిచ్చారు.
ఈ ఆత్మీయ అభినందన సత్కారంలో పదవీ విరమణ పొందిన జిఎం శ్రీ టి సూర్యనారాయణ, వారి సతీమణి శ్రీమతి బాల,ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సంఘ నాయకులు అంతోటి పాల్, కొప్పరి నవతన్, గుగులోత్ కృష్ణ , శంకర్సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ నుండి ఏజిఎం రామకృష్ణ, డీజీఎం రాజశేఖర్,శంకర్,
సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version