వైద్య వృత్తిలో నేడు వ్యాపారాత్మక ధోరణి ప్రజ్వరిల్లుతున్న ఈ రోజుల్లో, మంచితనం మానవత్వంతో సేవా దృక్పథంతో,పేద సాదా బీద బిక్కి అందర్నీ ప్రేమిస్తూ,మానవత్వంతో కూడిన వైద్య సేవ పరిమళాలను వెదజల్లుతూ,అలుపెరుగని నిత్య కృషివలుడుగా,గాయత్రి హాస్పిటల్ ద్వారా,చారిత్రాత్మక సేవలను అందిస్తున్నటువంటి మనందరికీ అభిమాన పాత్రులు, పేద రోగులపాలిటీ దైవం,
వైద్యో నారాయణో హరి అన్న పదానికి అసలు సిసలైన నిర్వచనం గా ఉన్నటువంటి డాక్టర్ అల్లూరి నాగరాజు డాక్టర్లలో దేవుడని,తాము వారికి ఎల్లప్పుడూ జెడ్ కేటగిరి అంగరక్షకులుగా ఉంటామని,
ఆ దేవుడు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు పేదవారికి అవసరత ఉన్నవారికి, చేయూతనందించి వైద్య సేవలు అందించే శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని,అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ తెలంగాణ బాలోత్సవ్ కన్వీనర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గిడ్ల పరంజ్యోతి రావు,రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసం రామకృష్ణ, ఖమ్మం ఆరోఖ్య హాస్పిటల్స్ వర్కింగ్ పార్టనర్ శ్రీ వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అధినేత నరసింహబాలీవుడ్ నటుడు సోనూసూద్ అభిమాన సంఘం నాయకులు సత్తార్, సభ్యులు పిట్టల రమేష్ ,గజ్జల నాగేశ్వరరావు, గాయత్రి హాస్పిటల్ సిబ్బంది లలిత కుమారి,రాజేందర్,షమీం, విశాలి, చోటు సురేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ నాగరాజును ఘనంగా సత్కారంమద్దెల శివకుమార్
by Naddi Sai
Published On: July 1, 2025 9:33 pm
