డాక్టర్ నరసింహ సేవలు అమోఘం : బింగి స్వామి కె ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
సేవకు దక్కిన ఫలితం డాక్టరేట్
ప్రశ్న ఆయుధం గాజ్వెల్ 28జూన్:
భానూరుకు చెందిన డాక్టర్ పెద్దపురం నరసింహకు ఇటీవలే సేవ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డు మ్యాజిక్ ఆర్ట్ అండ్ యూనివర్సిటీ హర్యానా వారు డాక్టరేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బింగి స్వామి కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డిపల్లి వాసులతో కలిసి వారిని సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు డాక్టర్ నరసింహ ముందు వరుసలో ఉండి తన వంతు సహాయం చేస్తున్నాడని సేవలోనే తృప్తి పొందే వారికి డాక్టరేట్ ఇవ్వడం చాలా గర్వకారణం అన్నారు డాక్టర్ నరసింహ మాట్లాడుతూ జీవితం అన్నది చాలా చిన్నదని జీవితంలో మనము చేసిన మంచి మాత్రమే మిగులుతుందని అందుకే సేవ కార్యక్రమాల్లో తాను ముందువరుసలో ఉంటానని తెలిపారు. సేవ చేయడం దేవుడు తనకిచ్చిన వరంగా తన బాధ్యతగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని అది వివిధ రూపాల్లో తాను చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు పెన్షన్లు పేద విద్యార్థులకు ఫీజులు పేద వధూవరులకు పుస్తె మంటలు ఉచితంగా ఫంక్షన్ హాల్ లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ కౌన్సిలర్ బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి మాజీ వార్డు మెంబర్ బొమ్మ మల్లయ్య జిల్లా చంద్రం సిద్దల బీరయ్య గుంటి రమేష్ గుంటి రాజు తదితరులు పాల్గొన్నారు